Ad Code

ట్రూ కాలర్‌ లో ఎస్సెమ్మెస్ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ !


యూజర్ల సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ట్రూకాలర్‌ యాప్‌లో రోజురోజుకీ కొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను ట్రూకాలర్‌లో తీసుకొచ్చారు. ప్రస్తుతం మోసపూరిత మెసేజ్‌లు ఎక్కువవుతున్నాయి. లాటరీలు, బంపరాఫర్‌ల పేరిట రకరకాల తప్పుడు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టడానికే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  ఆధారిత ఎస్సెమ్మెస్ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను ట్రూ కాలర్‌ యాప్‌ తీసుకొచ్చింది. విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్‌లు, కేవైసీ సంబంధిత, లోన్‌లు, ఛారిటీ, లాటరీ ఇలా రకరకాల మోసపూరిత మెసేజ్‌లను ట్రూ కాలర్‌ కొత్త ఫీచర్‌ గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్‌లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్‌ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. ట్రూకాలర్‌ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం దేశంలోని ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్‌ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్‌ వచ్చినప్పుడు కొత్త ఫీచర్‌ ఆధారంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్‌ పొరపాటున ఆ ఫ్రాడ్‌ మెసేజ్‌ను ఓపెన్‌ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్‌ డిసేబుల్‌ చేస్తుంది. అయితే ఆ మెసేజ్‌ సురక్షితమే అని యూజర్‌ స్పష్టంగా గుర్తిస్తేనే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu