Ad Code

ఫోర్స్ మోటార్స్ వారి సిటీలైన్ !


ఫోర్స్ మోటార్స్ తాజాగా కొత్త మల్టీ యూటిలిటీ వెహికల్ తీసుకువచ్చింది. దీని పేరు ఫోర్స్ సిటీలైన్. పెద్ద కుటుంబం లేదంటే ఉమ్మడి కుటుంబం కలిగిన వారికి  ఈ కారు ఉపయోగపడుతుంది. ఇతర క్రూయిజర్ మోడళ్ల మాదిరి కాకుండా ఈ కారులో సీట్లు ముందు వైపునకే ఉంటాయి. కొన్నింటిలో సైడ్ సీట్లు ఉంటాయి. ఇలా సైడ్ సీట్లు ఉన్న వాటిల్లో మొత్తంగా చూస్తే 13 మంది కూడా వెళ్లొచ్చు. అయితే ఈ కొత్త మోడల్‌లో అన్నీ కూడా ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు ఉంటాయి. పది మంది ప్రయాణం చేయొచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15.93 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఈ కారు ముందు భాగంలో ఇద్దరు, వీరి వెనక ముగ్గురు, తర్వాత ఇద్దరు, వీరి వెనక ముగ్గురు ఇలా మొత్తంగా పది మంది కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఈ కారులో పవర్ విండోస్, వపర్ స్టీరింగ్, వెనుక భాగంలో కూర్చున్న వారికి సెపరేటు ఏసీ, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉందులో ఉన్నాయి. ఈ కారులో మెర్సిడెస్ బెంజ్ సోర్స్డ్ ఎఫ్ఎం 2.6 సీఆర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో ఐదు గేర్లు ఉంటాయి. ఇంజిన్ పవర్ 90 హెచ్‌పీ, అలాగే టార్క్ 259 ఎన్ఎం. అందువల్ల కొత్తగా కారు కొనాలని భావించే వారు లేదంటే ట్రావెల్ కోసం కారు కొనాలని ప్లాన్ చేసే వారు ఉంటే.. ఈ కారును ఒకసారి పరిశీలించొచ్చు. టూరిజం ట్రావెల్‌కు కూడా ఈ కారు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాగా ఫోర్స్ మోటార్స్ కంపెనీ రానున్న కాలంలో ఈ కొత్త సిటీలైన్ మోడల్‌లో మరో కొత్త వేరియంట్‌ను తీసుకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల మీరు కొత్తగా ఈ సిటీలైన్ మోడల్ కొనుగోలు చేయాలని భావిస్తే.. కొంత కాలం ఆగడం ఉత్తమం. లేదంటే దీన్నే కొనుగోలు చేయొచ్చు. తుఫాన్ వంటి మోడళ్ల మాదిరి కాకుండా ఇందులో అన్ని సీట్లు ముందు వైపునకే ఉంటాయి. అందువల్ల జర్నీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తుఫాన్‌లో చివర క్యాబిన్‌లో ప్రయాణికులకు ఎదురెదురుగా కూర్చోవాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu