Ad Code

టయోటా నుంచి కొరొల్లా క్రాస్ హైబ్రీడ్ కారు !


టయోటా కొత్త కొరొల్లా క్రాస్ హైబ్రీడ్ కారు అమెరికాలో లాంచ్ అయ్యింది. ఈ కారు 3 వేరియంట్లలో లభిస్తోంది. అవి S, SE, XSE. వీటి పవర్ ఔట్‌పుట్ 196 HPగా ఉంది. ఈ కార్లలో మూడు రకాల ఎలక్ట్రిక్ మోటర్స్ ఉన్నాయి. ఈ కార్లు.. నాన్ హైబ్రీడ్ కార్లకంటే... ఎక్కువ ఫ్యూయల్ ఎకానమీ ఇస్తాయని తెలిపారు. సిటీలో గ్యాలన్‌కి 72 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తాయని తెలిపారు. 1 గ్యాలన్ అంటే.. 3.78 లీటర్లు. అంటే.. ఈ కారు లీటర్‌కి 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు లెక్క.  0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8 సెకండ్లలో అందుకుంటుందని తెలిపారు. 0.9-kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 185 కిలోమీటర్లు.  క్యాబిన్.. దాదాపు స్టాండర్డ్ కొరొల్లా క్రాస్ లాగానే ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ పైన్ ఎక్కువ స్పేస్ ఇచ్చారు.  ఎక్కువ పాకెట్స్ ఉన్నాయి. అందువల్ల చాలా వస్తువుల్ని దాచుకునే వీలుంది. డ్రైవర్ సీట్‌కి పవర్ ఇచ్చేందుకు 18 అంగుళాల అలాయ్ వీల్స్, LED హెడ్‌లైట్స్ ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది. స్టాండర్డ్ వైర్‌లైస్ ఫోన్ మిర్రరింగ్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, క్లౌడ్ బేస్డ్ నేవిగేషన్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. 5గురు ప్రయాణించేందుకు వీలు ఉంది. పొడవు 176.8 అంగుళాలు, వెడల్పు 71.9 అంగుళాలు, ఎత్తు 64.8 అంగుళాలు ఉంది.  S హైబ్రీడ్ ధర రూ.23,98,000 ఉండగా.. SE ధర రూ.25,06,000 ఉండగా.. XSE ధర రూ.26,51,600 ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu