Ad Code

కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో !


2011 జులై 15న పీఎస్‌ఎల్‌వీ సీ17 రాకెట్‌ ద్వారా జీశాట్‌-12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. ఏప్రిల్ 21తో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది.

Post a Comment

0 Comments

Close Menu