Ad Code

మహిళల కోసం ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ స్మార్ట్ వాచ్ !


ఫైర్ బోల్ట్ కంపెనీ మహిళల కోసం  ప్రత్యేకంగా  ఓ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా మహిళల మనస్సులను గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చిన్న డిస్‌ప్లేతో మహిళల చేతికి అందంగా కనిపించేలా ఈ వాచ్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఈ వాచ్ మహిళల కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేసినప్పటికీ కంపెనీకు చెందిన ఎల్‌యూఎక్స్ఈలో మొదటి మోడల్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 360×360 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. 43 ఎంఎం డయల్ కాన్ఫిగరేషన్‌తో త్రీడి కర్వ్డ్ గ్లాస్‌ ఈ వాచ్ ప్రత్యేకత. బ్లూటూత్ కాలింగ్, 60 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లు, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి ఎన్నో ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహిళల రుతచక్రం, నిద్రపోయే సమయం, హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 స్థాయిలను పర్యవేక్షించడానికి చాలా వీలుగా ఉంటుంది. ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్‌లో రెండు విభిన్న మెనూ డిజైన్‌లు, క్లాసీ వాచ్ ఫేస్‌ల ఎంపికలు ఉన్నాయి. అలాగే రిమోట్ కెమెరా కంట్రోల్, 210 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,999గా ఉంటుంది. ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ సిలికాన్, సిరామిక్ రెండు రకాల స్ట్రాప్‌లతో వస్తుంది. సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ గోల్డ్, సిల్వర్, పింక్‌తో సహా మూడు రంగు ఎంపికల్లో ఆకట్టుకుంటుంది. అలాగే సిరామిక్ వేరియంట్ గోల్డ్ డయల్‌తో పర్ల్-వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu