Ad Code

సీక్రెట్ కెమెరా ఛార్జర్ !


స్పై కెమెరాల్ని ఎక్కడెక్కడో ఉంచి రహస్య ఆపరేషన్ చేపట్టవచ్చు. అలాంటి స్పై కెమెరాల్లో ఇది ప్రత్యేకమైనది. ఇది చూడటానికి మొబైల్ ఛార్జర్‌లా ఉంటుంది. ఉండటమే కాదు. ఇది నిజంగానే ఛార్జర్ కూడా. అయితే సీక్రెట్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. IFITech కంపెనీ IFIADPT ఈ క్యామ్‌ని పరిచయం చేస్తోంది. ఇది 1080p సీక్రెట్ కెమెరా కలిగివున్న USB ఛార్జర్. ఇదో హోమ్ సెక్యూరిటీ స్పై కెమెరా. ఈ ఛార్జర్‌లో కనీసం 8జీబీ మెమరీ కార్డ్ అవసరం. మాగ్జిమం 256 Gb మెమొరీ కార్డ్ పెట్టుకునే స్లాట్ ఉంది. అందువల్ల ఈ కెమెరా కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది. కదలికలను గుర్తించేలా ఈ కెమెరాకి మోషన్ సెన్సార్లు ఉన్నాయి. ఈ ఛార్జర్‌తో USB కేబుల్ ద్వారా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే.. సీక్రెట్ కెమెరాతో రహస్య రికార్డింగ్ కూడా చెయ్యవచ్చు. ఐతే.. పూర్తి చీకటి ఉంటే మాత్రం కెమెరా రికార్డ్ చెయ్యలేదు. 70 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కలిగివుంది. కంటిన్యూగా HD AV కంటెంట్ రికార్డ్ చేయగలదు. ఈ డేటాని కేబుల్ లేదా కార్డ్ రీడర్ వాడి కంప్యూటర్‌లో చూడవచ్చు. HD 1920*1080p కలర్ వీడియో కెపాసిటీ కలిగివుంది. సెకండ్‌కి 30 ఫ్రేమ్స్ (FPS) AV అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ కెమెరాలో రికార్డింగ్ మోడ్‌లు 2 ఉన్నాయి. ఒకటి.. కంటిన్యూ రికార్డింగ్. ఇందులో SD కార్డ్ నిండిపోతే... మొదట నిండిన డేటాను ఓవర్ రైట్ చేస్తూ కంటిన్యూగా రికార్డ్ చేస్తుంది. రెండో రికార్డింగ్ మోడ్‌లో... కెమెరా తన ముందు ఏదైనా కదలిక ఉన్నప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తుంది. కదలిక లేనప్పుడు రికార్డ్ చెయ్యదు. తద్వారా SD కార్డు త్వరగా నిండిపోదు. ఈ కెమెరాకి FAT32 ఫార్మాట్ SD కార్డ్ సపోర్ట్ చేస్తోంది. ఇందుకోసం అదనపు సెట్టింగ్స్ ఏవీ చేయాల్సిన పనిలేదు. SD కార్డ్‌ని స్లాట్‌లో పెడితే చాలు. కెమెరా ఛార్జర్‌ను ప్లగ్ బోర్డుకి తగిలించగానే కెమెరా పనిచేయడం ప్రారంభిస్తుంది. తిరిగి ప్లగ్ బోర్డ్ నుంచి తీసేయగానే పనిచేయడం ఆగుతుంది. షాపులు, గోడౌన్లు, పిల్లల్ని కనిపెడుతూ ఉండేందుకూ ఇలా రకరకాల అవసరాలకు ఈ కెమెరా పనిచేస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu