Ad Code

ఇథనాల్ ఫ్యూయెల్ కుకింగ్ స్టవ్స్ !


హెచ్‌పీసీఎల్ కొత్త కుకింగ్ స్టవ్స్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఎల్‌పీజీ ఖర్చు తగ్గించడానికి కంపెనీ కొత్త స్టవ్స్ లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి భాగస్వామ్యంతో కొత్త స్టవ్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇథనాల్ ఫ్యూయెల్ కుకింగ్ స్టవ్స్ మార్కెట్‌లోకి రాబోతున్నాయి. అంటే ఎల్‌పీజీ సిలిండర్ అవసరం లేకుండానే మీరు ఇంట్లో వీటి ద్వారా వంట చేసుకోవచ్చు. బయో ఇథనాల్ అనేది పర్యావరణ అనుకూలం. చెరకు ద్వారా ఇథనాల్ తయారు చేస్తారు. దీని రేటు కూడా తక్కువగానే ఉంటుంది. హెచ్‌పీసీఎల్ తన రిటైల్ ఔట్‌లెట్స్‌లో ఇథనాల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానుంది. కస్టమర్లు వీటి ద్వారా ఇథనాల్ కొనుగోలు చేయొచ్చు. ఇలా ఇథనాల్ కుకింక్ స్టవ్స్ ద్వారా వంట చేసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయెల్ ఖర్చు తగ్గుతుందని చెప్పుకోవచ్చు.ఇథనాల్ ధర తక్కువ కావడంతో మార్కెట్లోకి రానున్న కొత్త కుకింగ్ స్టవ్స్‌తో గ్యాస్ సిలిండర్ కన్నా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో వంట చేసుకోవచ్చు. కాగా మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంచనున్నాయి. దీని రేటు రెగ్యులర్ పెట్రోల్ కన్నా తక్కువగానే ఉండనుంది. ఇలా రానున్న కాలంలో ఫ్యూయెల్ బిల్లు బాగా తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu