Ad Code

సోలార్ పవర్ లాంతర్ !


టేబుల్ ల్యాంప్, రీడింగ్ లైట్, టాస్క్ లైట్, బాల్కనీ లైట్, క్యాంపింగ్ లైట్ లాగా పనిచేస్తుంది. దీన్ని గోడకు వేలాడదీయవచ్చు. దీనికి కాంతి ఎంత ఉండాలి అనేదానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఫుల్లుగా సోలార్ పవర్ ఛార్జ్ అయితే.. ఇది మినిమం కాంతితో 12 గంటలు పనిచేస్తుంది. సెకండ్ ఆప్షన్ ద్వారా ఈ లైట్ 4 గంటలు వెలుగుతుంది. మూడో ఆప్షన్ ద్వారా ఈ లైట్ 3 గంటలు వెలుగుతుంది. ఈ లైట్‌ పైన ఉన్న సోలార్ ప్యానెల్‌కి ఎండ తగిలేలా ఉంచితే.. 8 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుందని తెలిపారు. ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో 30 డిగ్రీల యాంగిల్‌లో ఉంచాలని తెలిపారు. దీనికి సోలార్ ఛార్జ్ ఇండికేటర్ ఉంది. అందువల్ల సోలార్ పవర్ ఎంత ఉందో ఈజీగా తెలుస్తుంది. దీనికి చీకట్లో మెరిసే బటన్ ఉంది. ఆ బటన్ ద్వారా ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కూడా ఉంది. అందువల్ల దీన్ని ఎక్కడికైనా పట్టుకొని తీసుకెళ్లడం తేలిక. దీన్ని వెనక్కి తిప్పి కూడా ఉంచుకోవచ్చు. ఎలాగైనా నిలబెట్టుకునేలా దీన్ని తయారుచేశారు. దీని LFP సోలార్ బ్యాటరీ ఐదేళ్లపాటూ పనిచేస్తుందని తెలిపారు. ఇది ఎండ, వాన, చలి వాతావరణాన్ని తట్టుకోగలదు. 2 ఏళ్ల వారంటీ ఉంది. తయారీలో ఎక్కువ కాలం మన్నే ABS ప్లాస్టిక్ వాడారు.  మెయింటేన్ చెయ్యడం తేలిక అని తెలిపారు. ఈ లైట్‌ని చైనాలో తయారుచేస్తున్నారు. దీని తయారీలో ప్రపంచ ప్రమాణాలు పాటించినట్లు తెలిపారు. 12.5 x 9 x 19.5 cm డైమెన్షన్స్ కలిగి ఉంది. దీని బరువు 200 గ్రాములు ఉంది. సోలార్ ప్యానెల్‌ ఇన్‌బిల్ట్‌గా ఉంటుందనీ, LED బల్బ్ ఉందని తెలిపారు. క్యాంపింగ్‌కి వెళ్లేవారు ఈ లైట్‌ని వెంట తీసుకెళ్తే.. రాత్రంతా లైటింగ్‌తో ఉండొచ్చని తెలిపారు. రాత్రివేళ సాహనాలు, పనులు చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu