Ad Code

వాటర్ స్ప్రే ఫ్యాన్‌తో రూమ్ క్షణాల్లో కూల్ !


ఏసీ, కూలర్ లేకుండా వేడి నుంచి ఉపశమనం పొందటానికి వాటర్ స్ప్రే ఫ్యాన్. ఏసీ వంటి వాటితో పోలిస్తే వీటి ధర అందుబాటులో ఉంటుంది. అలాగే దీన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇవి వాటర్ స్ప్రేను వెదజల్లుతాయి. ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతున్నప్పుడు ఇలా వాటర్ స్ప్రే రావడంతో రూమ్ వెంటనే కూల్ అయిపోతుంది. వీటి మెయింటనెన్స్ కూడా ఏసీలు, కూలర్ల మాదిరి ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల వాటర్ స్ప్రే ఫ్యాన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈకామర్స్ సైట్ల నుంచి ఈ వాటర్ స్ప్రే ఫ్యాన్ ఆర్డర్ ఇవ్వొచ్చు. దీని రేటు రూ. 2000 నుంచి ప్రారంభం అవుతుంది. మిస్ట్ ఫ్యాన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది 26 ఇంచుల సైజ్‌లో ఉంటుంది. దీని ఎత్తు 6.5 అడుగులు ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని ఆన్ చేస్తే రూమ్ టెంపరేచర్ 5 నుంచి పది డిగ్రీలకు తగ్గిపోతుంది. వాటర్ స్ప్రే దాదాపు 10 అడుగుల వరకు వెళ్తుంది. అలాగే ఓరియెంట్ ఎలక్ట్రిక్ కూడా ఇలాంటి ఫ్యాన్‌ను అందిస్తోంది. క్లౌడ్ కూలింగ్ ఫ్యాన్ అందిస్తోంది. దీని పేరు క్లౌడ్ 3. ఇందులో 4.5 లీటర్ ట్యాక్ ఉంటుంది. ఇది కూడా కూలర్ మాదిరి మీ రూల్‌ను కూల్ చేసేస్తుంది. ఉబెర్ స్వీట్ రీచార్జబుల్ వాటర్ స్ప్రే ఫ్యాన్ కూడా ఉంది. ఇది రీచార్జబుల్ వాటర్ స్ప్రే ఫ్యాన్. పర్సనల్ యూజ్ కోసం కొనొచ్చు. కిచెన్ దగ్గరి నుంచి లివింగ్ రూమ్ వరకు ఎక్కడైనా దీన్ని ఉపయోగించొచ్చు. బరువు తక్కువగా ఉంటుంది. అదిరే ఎయిర్ ఫ్లో అందిస్తుంది. ఇంకా అలోక్ ఏజెన్సీస్ 26 మిస్డ్ ఫ్యాన్ కూల్ కూడా ఉంది. పెద్ద పెద్ద రూమ్స్, హాల్స్‌లో అయితే ఈ ఫ్యాన్ అనువుగా ఉంటుంది. దీని పొడవు 6.5 అడుగులు ఉంటుంది. వాటర్ ట్యాంక్ కెపాసిటీ 41 లీటర్లు. బలమైన గాలితో వాటర్ స్ప్రేను ఇది రిలీజ్ చేస్తుంది. దీంతో రూమ్ కూల్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu