Ad Code

ఇజ్రాయెల్ లో మొబైల్ డేటా చౌక

 

ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్‌ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ 1 జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. యూకే లోని డేటా విశ్లేషణ వెబ్‌ సైట్‌ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ లో ప్రతి నలుగురిలో ముగ్గురు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఇది అమెరికా కంటే ఎక్కువ. డిమాండ్ ఎక్కువ కాబట్టి, అక్కడ డేటా కూడా బాగా చౌకగా మారిపోయింది. ఇజ్రాయెల్ తర్వాతి స్థానం ఇటలీది. ఇటలీలో 1 జీబీ టేడా ఖరీదు 0.12 డాలర్లు. భారత్ లో 1 జీబీ డేటా 0.17 డాలర్లు. మన కరెన్సీలో దాదాపుగా 14 రూపాయలన్నమాట. మొబైల్ డేటా చౌకగా దొరికే దేశాల లిస్ట్ లో భారత్ మూడో స్థానంలో ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డేటా ప్లాన్‌ లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్‌ దీవుల్లో ప్రజలు 1 జీబీ డేటా కోసం 38.45 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్‌ హెలెనాలో 1జీబీ డేటా ఖరీదు ఏకంగా 41.06 డాలర్లు. అంటే ఇక్కడి ప్రజలు ఇజ్రాయెల్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ చెల్లించి మొబైల్ డేటాను కొనుగోలు చేస్తున్నారనమాట. రాబోయే రోజుల్లో డేటా ఖరీదు మరింతగా తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చౌక డేటాకు ప్రజలను బాగా అలవాటు చేసి, డేటా వినియోగం తప్పనిసరి అయిన తర్వాత మెల్ల మెల్లగా కంపెనీలు రేట్లు పెంచుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. 

Post a Comment

0 Comments

Close Menu