Ad Code

మోషన్ సెన్సార్‌ టెక్నాలజీ!


జెనెరిక్ బ్రాండ్ నుంచి ఈ సోలార్ లైట్ PIR మోషన్ సెన్సార్ వాల్ ల్యాంప్ వచ్చింది. ఇది ఎండా వానా అన్నింటినీ తట్టుకోగలదు అని తెలిపారు. దీనికి పైన ఓ సోలార్ ప్లేట్ చిప్ ఉంది. ఇంటి గోడకు ఈ లైట్‌ని స్క్రూల ద్వారా ఎండ పడేలా తగిలిస్తే.. ఎండ నుంచి సోలార్ పవర్ తయారవుతుంది. దీనికి 20 LED లైట్స్ ఉన్నాయి. రాత్రివేళ ఈ లైట్స్ వెలుగుతూ.. కాంతిని ఇస్తాయి. తద్వారా కరెంటు ఖర్చు లేకుండా లైట్ వెలుగుతుంది. ఇందులో 3.7V/800mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 6 నంచి 8 గంటల్లో ఫుల్లుగా ఛార్జ్ అవుతుంది. అలాగే.. లైట్లు 8 గంటలకు పైగా కాంతిని ఇస్తాయి. ఈ పరికరం పొడవు 20.3 సెంటీమీటర్లు, వెడల్పు 12.7 సెంటీమీటర్లు, ఎత్తు 2.5 సెంటీమీటర్లు ఉంది. దీన్ని తేలిగ్గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి వైర్లూ అవసరం లేదని తెలిపారు. ఇది ఇంట్లోనే కాకుండా.. టెర్రస్‌, గార్డెన్‌, బ్యాక్‌యార్డ్, బాల్కనీ, గ్యారేజ్, డ్రైవ్ వే, పాత్‌వేలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి ఉన్న మోషన్ సెన్సార్ వల్ల.. రాత్రివేళ ఏదైనా కదలిక ఉన్నప్పుడు గుర్తించి.. ఈ లైట్ వెలుగుతుంది. కదలిక లేకపోతే వెలగదు. పగటివేళ వెలగదు. రాత్రంతా ఈ లైట్ వెలగాలి అనుకునేవారు... మోషన్ సెన్సార్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. తద్వారా మాన్యువల్‌గా లైట్ ఆన్ చేసుకోవచ్చు. దీనికి కాంతికి సంబంధించి 2.6/5 రేటింగ్ ఉంది, వెదర్‌ప్రూఫ్‌కి 2.4/5 రేటింగ్ ఇవ్వగా.. మోషన్ డిటెక్షన్‌కి 2.2 రేటింగ్ ఇచ్చారు. 


Post a Comment

0 Comments

Close Menu