Ad Code

అమెజాన్‌ బ్లాక్‌బ్లస్టర్‌ వ్యాల్యూ డేస్‌ !


అమెజాన్‌ ఇండియా 'బ్లాక్‌బ్లస్టర్‌ వ్యాల్యూ డేస్‌' సేల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌ 14 నుంచి 17 వరకు ప్రత్యేకంగా సేల్‌ నిర్వహించనుంది. ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌ బ్యాక్‌ సైతం అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన సేల్‌లో 32 అంగుళాల స్మార్ట్‌ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. '4కే, ఓఎల్‌ఈడీ, క్యూఎల్‌ఈడీ' టీవీలపై 60 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. వన్‌ ప్లస్‌, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్‌కే సొంతం చేసుకోవచ్చు. వన్‌ ప్లస్‌, రెడ్‌మీ, శాంసంగ్‌తో పాటు ఇతర గేమింగ్‌ డివైజ్‌లపై 25శాతం, గేమ్‌ టైటిల్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌లు పొందవచ్చు. అమెజాన్‌ ఉత్పత్తులైన ప్లే స్టేషన్‌ డివైజ్‌లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌లపై డిస్కౌంట్‌లు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్‌ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్‌లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu