Ad Code

మరింత స్పీడ్‌ పెరిగిన క్రోమ్‌ బ్రౌజింగ్ !


క్రోమ్‌లో సరికొత్త మార్పులను గూగుల్ సంస్థ తీసుకొస్తోంది. యూజర్లకు వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌ను అందించడానికి గూగుల్ తన క్రోమ్ వెబ్ బ్రౌజర్ కి సరికొత్త అప్‌డేట్స్‌ యాడ్ చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవల కాలంలో కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌తో క్రోమ్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. దాంతో ఈ బ్రౌజర్ ప్రస్తుతం Mac, Android డివైజ్‌లలో చాలా ఫాస్ట్ వెబ్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తోంది. CPU, మెమరీ, బ్యాటరీ యూసేజ్ వంటి అండర్-ది-హుడ్ పనితీరును మెరుగు పరచడం ద్వారా క్రోమ్ బ్రౌజింగ్ స్పీడ్ అయినట్లు కంపెనీ తెలిపింది. Mac, ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో క్రోమ్ వేగం, సామర్థ్యాన్ని పెంచేలా వెబ్ బ్రౌజర్‌కు ఇంప్రూవ్‌మెంట్స్ యాడ్ చేసినట్టు గూగుల్ వివరించింది. ఈ ఇంప్రూవ్‌మెంట్స్‌లో మెరుగైన మెమరీ మేనేజ్‌మెంట్‌, మెరుగైన క్యాషింగ్‌ ఉంటుంది. ఈ మార్పులు బ్రౌజింగ్‌ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయని గూగుల్ పేర్కొంది. గూగుల్ తన Chrome బ్రౌజర్‌లో దాని వేగం, సామర్థ్యాన్ని పెంచడానికి గత మూడు నెలల్లో అనేక మార్పులు, సర్దుబాటులను చేసింది. ఫలితంగా, వెబ్ బ్రౌజింగ్ పనితీరును కొలవడానికి ఉపయోగించే యాపిల్ స్పీడోమీటర్ 2.1 బెంచ్‌మార్క్‌పై క్రోమ్ 10% మెరుగుదలని సాధించింది. ముందుగా చెప్పుకున్నట్టు క్యాషింగ్, మెమరీ మేనేజ్‌మెంట్‌ వంటి ఇతర ఫీచర్లను కూడా Google మెరుగుపరచడం వల్ల ఇది వినియోగదారులకు బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. విభిన్న సామర్థ్యాలతో కూడిన ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బెస్ట్ పర్ఫామెన్స్ అందించడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఆప్టిమైజ్ చేసింది. బైనరీ సైజు కంటే వేగానికి ప్రాధాన్యతనిచ్చే కంపైలర్ ఫ్లాగ్స్‌తో గూగుల్ దీన్ని సాధించింది. క్రోమ్ కొత్త అప్‌డేట్ హై-ఎండ్ డివైజ్‌లలో వేగవంతమైన పర్ఫామెన్స్ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అప్‌డేటెడ్ క్రోమ్ బ్రౌజర్ సపోర్టెడ్ డివైజ్‌ల్లో స్పీడోమీటర్ 2.1 బెంచ్‌మార్క్‌ టెస్ట్‌ను 30% కంటే ఎక్కువ వేగంగా కంప్లీట్ చేస్తుంది. అప్పుడు ఈ డివైజ్‌ల యూజర్లు గత వెర్షన్‌తో పోలిస్తే ఈ కొత్త క్రోమ్‌లో వేగవంతమైన బ్రౌజింగ్‌ అనుభూతిని పొందుతారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో మెరుగుపరచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ వెబ్ బ్రౌజర్ రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత స్లోగా మారుతుంది. అయితే గూగుల్ ఇటీవల చేసిన ఈ కొత్త మార్పులతో, బ్రౌజర్ మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు పాత పాస్‌వర్డ్‌లను మార్చడం, సైట్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం, బుక్‌మార్క్‌లను మెయింటైన్ చేయడం ముఖ్యమని గూగుల్ తన యూజర్లకు సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu