Ad Code

కారుని మూడేళ్లు వాడుకుని తిరిగిస్తే రూ. 6 లక్షలు !


ఈరోజు ఎంజీ మోటార్ ఇండియా మూడు వేరియంట్లను విడుదల చేసింది. స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ఆవిష్కరించింది. ఎంజీ కామెట్ ఈవీ.. పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎంజీ కామెట్ ఈవీ ప్రత్యేక ధరలను ప్రకటించింది. పేస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 7.98 లక్షలు ఉండగా.. ప్లే వేరియంట్ రూ. 9.28 లక్షలు, ప్లష్ వేరియంట్ ధర రూ. 9.98 లక్షలుగా కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కేవలం మొదటి 5 వేల బుకింగ్స్ వరకే ఉందని తెలిపింది. ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ కార్లను 2023 మే 22 నుంచి డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ ఇది వరకే ప్రకటించింది. కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ. ప్రయాణం చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇది 3.3 కిలోవాట్ ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లు వరకూ వారంటీ ఇస్తుంది. ఇక బ్యాటరీ మీద 8 ఏళ్ళు లేదా 1,20,000 కి.మీ. వారంటీ ఇస్తుంది. అలానే రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని కల్పిస్తుంది. 3 సర్వీసులకు వరకూ ఉచితంగా అందిస్తుంది. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే.. మూడేళ్ళ తర్వాత కారుని కంపెనీకి తిరిగి ఇచ్చేస్తే మీరు ఎంత ధర పెట్టి కొన్నారో అందులో 60 శాతం డబ్బును మీకు కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు మీరు ఎంజీ కామెట్ ఈవీ బేసిక్ వేరియంట్ ను రూ. 8 లక్షలకు కొనుగోలు చేస్తే మూడేళ్ళ తర్వాత రూ. 4,80,000 తిరిగి ఇచ్చేస్తుంది. అదే 10 లక్షలు పెట్టి కొంటే 60 శాతం అంటే రూ. 6 లక్షలు ఇస్తుంది. మామూలుగా ఏ కారు కొన్నా గానీ ఏడాది దాటితే దాని రీసేల్ వేల్యూ అనేది సగానికి పడిపోతుంది. కానీ ఈ కారు మూడేళ్లు వాడినా కూడా కంపెనీ సగం కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తామని చెబుతుంది. బ్యాటరీ మీద 8 ఏళ్ళు వారంటీ, కారు మీద మూడేళ్లు వారంటీ ఇస్తుంది. మూడేళ్లు వాడిన తర్వాత మొహం మొత్తేసినా మీరు కొన్న ధరలో 60 శాతం కంపెనీ ఇచ్చేస్తుంది. బై బ్యాక్ కింద కారుని మూడేళ్ళ తర్వాత తామే కొంటామని కంపెనీ ప్రకటించింది. 

Post a Comment

0 Comments

Close Menu