Ad Code

ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ స్మార్ట్ ఫోన్


దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్లో హోల్ పంచ్ డిస్ప్లేను అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఫ్లిప్కార్ట్ లో వచ్చే వారం నుంచి ఈ ఫోన్ సేల్ జరగనుంది. ఈ ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బేస్ వేరియంట్ ధర 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. అరోరా బ్లాక్, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జులై 18వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ అందించనున్నారు. అంటే రూ.12 వేలలోపే 128 జీబీ స్టోరేజ్ ఉన్న బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే కూడా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్నెస్ 580 నిట్స్గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ను డిస్ప్లేలో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ద్వారా ఇన్ఫీనిక్స్ హాట్ 30 5జీ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ కూడా ఉంది. దీన్ని మెమ్ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతోపాటు 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంది. 1 టీబీ వరకు ఎస్డీ కార్డును ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. వెనకాల క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్, ముందువైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కూడా ఉన్నాయి. 5జీ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, వైఫై ఫీచర్ల ద్వారా కనెక్టివిటీ లభించనుంది. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జీ-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ అందుబాటులో ఉంది. డీటీఎస్ టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఫోన్ పని చేస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30 5జీ మందం 0.99 సెంటీమీటర్లు కాగా, బరువు 215 గ్రాములుగా ఉంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu