Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, July 26, 2023

త్వరలో దేశీయ మార్కెట్ లోకి ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్‌


దేశీయ మార్కెట్ లోకి ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్‌ ను విడుదల చెయ్యనున్నారు. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల అవ్వక ముందే డిమాండ్ కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  వచ్చే నెల మధ్యలో ఈ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌లో తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటన రాలేకపోయినప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కథనాల ప్రకారం కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి. 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు..ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 66 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ అందించనున్నారు..ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు ధర ఉంటుందని అంచనా.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts