Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, September 11, 2023

నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల


నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇది పర్పుల్, పింక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ స్నాపర్, స్లిమ్ బెజెల్స్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్ అందించబడింది. ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రిపుల్ కెమెరా ఎంపిక ఇవ్వబడింది.. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC, గ్రాఫిక్స్ కోసం Adreno GPUతో అందించింది కంపెనీ. 4GB/6GB RAM, 128GB నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు. 5జీబీ వర్చువల్ ర్యామ్‌ సపోర్ట్ చేస్తుంది.. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OS పై రన్ అవుతుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్‌ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది నోకియా.. 20 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.. అలాగే ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి.. సైడ్ ఫింగర్ ప్రింట్ తో పాటు సెన్సార్ ను కూడా కలిగి ఉంది.. ధర వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

No comments:

Post a Comment

Popular Posts