Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, September 1, 2023

రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు !


 


చైనాకుచెందిన అలీబాబా ఎలక్ట్రికల్ వెహికల్ సంస్థ రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారును  తయారు చేసింది. పులి ఆకారంతో విచిత్రంగా ఉండే ఈ సూపర్ చీప్ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు ప్రయాణించేందుకు వీలుగా రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అయితే దీని స్పీడ్ మాత్రం ఎక్కువే.. గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట!. ఇది పట్టణాల్లో నివసించేవారికి చాలా సౌకర్యంగా ఉంటుందంటున్నారు తయారీదారులు.. ఇద్దరికి మాత్రమే చోటు ఉన్న ఈ కారులో కపుల్స్.. అలా ఏకాంతంగా చక్కర్లు కొట్టిరావొచ్చంటున్నారు. నానో కంటే మరీ చీప్ అయిన ఈ కారు.. కేవలం 1199 డాలర్లకే లభిస్తుందట.. అంటే దాదాపు రూ. 99వేలకు సమానం అన్నమాట.. పార్కింగ్ కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.. చాలా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 35 kW మోటార్ ను కలిగివుంటుంది. ఇది 47 హార్స్‌పవర్ తో 120 km/h (75 mph) గరిష్ట వేగంతో ప్రయాణించొచ్చు. ఇది USలోని సాధారణ కారుతో పోల్చితే పెద్దగా అనిపించకపోయినా.. అయితే గరిష్ట వేగాన్ని అందుకోవడానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువ. హైవేపై చిన్న ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారికి ఇది మంచి సౌకర్యం. 

No comments:

Post a Comment

Popular Posts