Ad Code

తప్పిపోయిన వారికి సహాయపడే క్యూఆర్ కోడ్ లాకెట్లు !


ప్పుడున్న టెక్నాలజీ లో క్యూఆర్ కోడ్ అనేది కీలకంగా మారింది. నగదు బదిలీలకే కాదు ఇప్పుడు మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ ని ఓ యువ ఇంజనీర్ రూపొందించారు. కుటుంబ నుంచి తప్పిపోయి తమ ఇంటి వివరాలు చెప్పలేనివాళ్ల కోసం క్యూఆర్ కోడ్ చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది. బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ క్యూఆర్ కోడ్ ఉన్న లాకెట్ చక్కటి సహాయకారిగా ఉంటుంది. అక్షయ్ రిడ్లాన్ అనే 24 ఏళ్ల డేటా ఇంజనీర్ అభివృద్ధి చేశాడు.  దివ్యాంగులు, వికలాంగులు, అల్జీమర్ బాధితులు,వృద్ధులు పొరపాటున ఒక్కోసారి వారు తమవారి నుంచి తప్పిపోతే ఈ లాకెట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా వారి సొంతవారిని గుర్తించవచ్చు. ఇటువంటివారు తమ ఇళ్ల నుండి బయటికి వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే అవకాశాలున్నాయి. అలా జరిగితే వారి ఆచూకీ తెలుసుకోవటానికి ఈ క్యూఆర్ కోడ్ లాకెట్లు ఉపయోగపడతాయి. మానసిక వైకల్యం, ట్రీట్ మెంట్ పరంగా ఎమర్జన్సీ పరిస్థితులతో ఉన్నవారి కోసం ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత లాకెట్లు అందించటానికి చేతన  ప్రాజెక్ట్ చేపట్టారు. దీని ద్వారా బాధితులు వారి కుటుంబాలను సులభంగా చేరుకోవచ్చు. ఎవరైనా లాకెట్టులో కస్టొమైజ్డ్ QR కోడ్‌లను స్కాన్ చేస్తే..ఆ లాకెట్ ధరించిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుస్తాయి. ఈ కోడ్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ లాకెట్ ధరించినవారి పేరు, వారి ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ అలా వారి బ్లడ్ గ్రూప్ వంటివి దీంట్లో పొందుపరచబడి ఉంటాయి.


Post a Comment

0 Comments

Close Menu