Ad Code

వచ్చేనెల 12న ఐక్యూ 12 5జీ ఆవిష్కరణ !


దేశీయ మార్కెట్లో వచ్చేనెల 12న ఐక్యూ తన ప్రీమియం ఐక్యూ12 5జీ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఈ నెల ఏడో తేదీన గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఐక్యూ12 5జీ కానున్నది. తొలి నాన్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కానున్నది. అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్ ద్వారా ఈ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. ఐక్యూ12 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపుగా రూ.45 వేలు (3,999 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.50 వేలతో (4,299 చైనా యువాన్లు) కొనుగోలు చేయొచ్చు. బర్నింగ్ వే, లెజెండ్ ఎడిషన్, ట్రాక్ వర్షన్ కలర్ ఆప్షన్లలో ఐక్యూ12 5జీ ఫోన్ లభిస్తుంది. బీఎండబ్ల్యూ మోటార్ స్పోర్ట్ ఇన్ స్పైర్డ్ ఫినిష్‌తో వస్తోంది ఐక్యూ12 5జీ ఫోన్. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ 1/1.3 అంగుళాల ప్రైమరీ సెన్సర్, 64 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ విత్ 100 ఎక్స్ డిజిటల్ జూమ్, 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.

Post a Comment

0 Comments

Close Menu