హానర్ 108 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో హానర్ ఎక్స్50ఐ+ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది ఇంతకుముందు గత ఏప్రిల్‌లో హానర్ ఎక్స్50ఐ మార్కెట్లోకి తీసుకొచ్చింది. హానర్ ఎక్స్50ఐ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 35 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. కానీ హానర్ ఎక్స్50ఐ+ ఫోన్ మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తున్నది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లు నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.18,600 (1599 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,900 (1799 చైనా యువాన్లు) పలుకుతుంది. అయితే, భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి హానర్ వెల్లడించలేదు. ఈ ఫోన్ క్లౌడ్ వాటర్ బ్లూ, ఫాంటసీ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, లిక్విడ్ పింక్ కలర్‌వేస్‌ల్లో లభిస్తుందీ ఫోన్. హానర్ ఎక్స్50ఐ+ ఫోన్ 6.7-అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్డీ + (2412×1080 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.2 వర్షన్‌పై పని చేస్తుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1జ75 అపెర్చర్, సెకండరీ 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/2/4 అపెర్చర్ తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. వీటితోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా జత చేశారు. కెమెరా యూనిట్లలో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. 35వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూత్ వీ 5.1, ఓటీజీ, జీపీఎస్, ఏజీపీఎస్,క్లోనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.
0 Comments