Ad Code

రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌ !


మెజాన్‌ సేల్‌లో భాగంగా రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్‌ అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ.11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ పవర్‌ ఫుల్ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. బ్యాక్‌ ఫింటర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఫీచర్‌ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, సెల్యూలార్‌, వైఫై, ట్రూ జీపీఎస్‌ వంటి ఫీచర్స్‌ను అందించారు. క్వాల్కమ్‌ మీడయా టెక్‌ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం. 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 680 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్ చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu