Ad Code

టాటా ఏఐజీ ఎయిర్ ఇండియా నుంచి ప్రయాణీకుల కోసం ప్రయాణ బీమా


టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్  కంపెనీ లిమిటెడ్ ప్రయాణ బీమాను అందిస్తోంది. ప్రత్యేకించి ఎయిర్ ఇండియాకు చెందిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఏఐజీ తమ ప్రయాణ బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఎయిర్ ఇండియా ప్రయాణీకుల ప్రయాణాలను మెరుగుపరచడం, వారి ప్రయాణాలకు వీలు కల్పించడమే లక్ష్యంగా అందిస్తోంది. ఎయిర్ ఇండియా వివిధ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులు ప్రయాణ బీమాను ఎంచుకోవచ్చు. ఎయిర్ ఇండియా ప్రయాణీకులు విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణ బీమా కవర్‌ను తీసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణీకులకు పూర్తి కవరేజీని అందించడానికి బీమా కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియాతో అనుబంధంపై టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీలేష్ గార్గ్ మాట్లాడుతూ.. 'ప్రయాణికులకు సాధారణ, కస్టమైజడ్ ప్రయాణ బీమా కవరేజీని, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు అందించడానికి దిగ్గజ బ్రాండ్ ఎయిర్ ఇండియాతో సంయుక్తంగా పనిచేస్తున్నాం. ఎయిరిండియా మొబైల్, వెబ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విమానాలను బుక్ చేసుకునేటప్పుడు యూజర్లు ఇప్పుడు ప్రయాణ బీమాను సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చే అనేక రకాల బీమా కవర్‌లతో, ప్రయాణాన్ని సురక్షితంగా మరింత ఆనందదాయకంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం' అని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో కలిసి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కస్టమర్‌లు అనేక ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ బీమా పాలసీ సాయపడుతుందని చెప్పారు. వెబ్‌సైట్ బుకింగ్ ఫ్లోతో, కాంటాక్ట్ సెంటర్ల వద్ద విలీనం అయింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద ప్రయాణీకుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ప్రయత్నిస్తోందని, భద్రత, కస్టమర్ సర్వీసులో నిబద్ధతతో ఉమ్మడి ప్రయత్నాలలో ముందంజలో ఉందని ఆయన అన్నారు.  టాటా ఏఐజీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌లలో హాస్పిటలైజేషన్ కవరేజ్, బ్యాగేజీ డిలే కవరేజ్, ఫ్లైట్ డిలే కవరేజ్, ట్రిప్ క్యాన్సిలేషన్ కవరేజ్ వంటి తరహా బెనిఫిట్స్, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu