Ad Code

ఎంజీ నుంచి రెండో ఎలక్ట్రిక్ కారు కామెట్ !


ఎంజీ నుంచి రెండవ ఎలక్ట్రిక్ కారు కామెట్ చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే విధంగా కనుగొన్నట్లు ఆ సంస్థ తెలియజేయడం జరిగింది. అయితే ఈ కారు ధర విషయానికి వస్తే 7.89 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 10 లక్షల వరకు ఉంటుందట!. అయితే ఇందులో వేరియేషన్ బట్టి ధరలలో వ్యత్యాసం ఉంటుందని తెలియజేస్తున్నారు. చిన్న కుటుంబం అంతా కలిసి ప్రయాణించేలా ఈ కారును సరికొత్త డిజైన్తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే తో పాటు ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్ తో పాటు స్టీరింగ్ వీర్ కంట్రోల్ బటన్ ని కూడా కలిగి ఉంటుంది..COMET కారు బ్యాటరీ విషయానికి వస్తే..17.3 KWH బ్యాటరీని సైతం కలిగి ఉంటుందట. బ్యాటరీ నుంచి వెలువడే శక్తి 110 MN టార్కును ఉత్పత్తి చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే చాలు దాదాపుగా 230 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. దీనికి పోర్టబుల్ చార్జర్ కూడా అందుబాటులో ఉన్నదట. కేవలం 5 గంటలలోనే జీరో నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలియజేస్తోంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు పార్కింగ్ సెన్సార్ ,సీటు బెల్స్, స్పీడ్ సిస్టం అలర్ట్ టైర్ ప్రెజర్ తదితర ఫీచర్లను సైతం ఇందులో ఉంచినట్లు తెలియజేస్తోంది ఈ కారులో 55 కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయట. అత్యాధునిక ఫీచర్లతో ఈ కారుని తయారు చేశారు. అయితే నెల మొత్తానికి చార్జింగ్ చేయడానికి ఖర్చు 519 రూపాయలు మాత్రమే అవుతుందని కంపెనీ తెలియజేసింది. దీంతో నెలకు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలుపుతున్నారు. ప్రాంతాలను బట్టి కరెంటు చార్జీల ధరలలో వ్యత్యాసం ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu