Ad Code

వచ్చే ఐదేళ్లలో జియో-ఇంటెలిజెన్స్ సేకరణకు 50 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం !


బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ టెక్‌ఫెస్ట్‌లో సోమ్‌నాథ్ మాట్లాడుతూ మార్పు గుర్తింపు, డేటా విశ్లేషణ, ఏఐ- సంబంధిత డేటా ఆధారిత ప్రయత్నాల పరంగా ఉపగ్రహాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యమని చెప్పారు. భారత దేశం బలమైన దేశంగా ఎదగాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ నౌకల పరిమాణం సరిపోదని, అది ఈ రోజు ఉన్న దానికంటే 10 రెట్లు అవసరమని సోమ్‌నాథ్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులు, పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచే సామర్థ్యం ఈ వ్యోమనౌకకు ఉందన్నారు. ఇదంతా శాటిలైట్ల ద్వారా చూడవచ్చని సోమ్‌నాథ్ అన్నారు. అ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాము. కానీ, ఇప్పుడు భిన్నమైన ఆలోచనా విధానం ఉంది అని ఆయన చెప్పారు. అయితే, ఏదైనా దేశం బలం దాని చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యమేనని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు 50 ఉపగ్రహాలను సమీకరించామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రత్యేక జియో-ఇంటెలిజెన్స్ సేకరణలో సహకరించేందుకు భారత్‌కు పంపుతున్నామని ఆయన అన్నారు. భారత్ ఈ స్థాయిలో ఉపగ్రహాలను ప్రయోగించగలిగితే దేశం ఎదుర్కొంటున్న ముప్పులను మరింత మెరుగైన రీతిలో తగ్గించవచ్చని సోమనాథ్ చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu