Ad Code

ఇంజనీర్పై దాడి చేసిన టెస్లా రోబో !


మెరికాలోని ఆస్టిన్ టెస్లా గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో కార్ల తయారీలో ఉపయోగించే అల్యూమినియం పార్ట్ను తీసుకెళ్లేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. అయితే ఓ రోబోలో తలెత్తిన సాంకేతిక లోపం ఓ ఇంజనీర్ ప్రాణాల మీదకు తెచ్చింది. రోబోల మెయింటెనెన్స్లో భాగంగా ఓ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అప్ డేట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మెయింటెనెన్స్ కోసం రెండు రోబోలను డిసేబుల్ చేసిన సదరు ఇంజనీర్ కు మూడో రోబోతో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా ఇంజనీర్ పై దాడికి పాల్పడిన రోబో అతని వీపుతో పాటు భుజంపై గాయం చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది రోబోను డిసేబుల్ చేసి తీవ్రంగా గాయపడిన బాధితున్ని హాస్పిటల్ కు తరలించారు. అతని వీపుతో పాటు ఎడమ చేతికి బలమైన గాయమైనట్లు డాక్టర్లు చెప్పారు. 2021 ఇంజ్యూరీ రిపోర్ట్లో రోబో దాడి విషయం వెల్లడైంది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా నిరాకరించింది. 2021 టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీలో ఈ ఘటన మినహా మరే ప్రమాదాలు జరగలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల భద్రత గురించి టెస్లా పట్టించుకోదని, వారి ప్రాణాలను రిస్క్లో పెట్టి పనిచేయిస్తుందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu