Ad Code

స్టీవ్ జాబ్స్ 'సంతకం' చెక్ వేలం !


47 ఏళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 'చెక్'ను 'ఆర్ఆర్ ఆక్షన్స్' అనే సంస్థ వేలానికి పెడితే పలువురు బిడ్లు దాఖలు చేశారు. ఆ బిడ్ల విలువ 25 వేల డాలర్లు. మన కరెన్సీలో రూ.20 లక్షల పై చిలుకు ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆర్ఆర్ ఆక్షన్స్ వెల్లడించింది. గమ్మత్తేమిటంటే ఆ చెక్ మీద నాలుగు డాలర్లు అని మాత్రమే రాసి ఉంది. ప్రస్తుతం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.333 మాత్రమే. 1976లో స్టీవ్ వోజ్నియాక్ తో కలిసి స్టీవ్ జాబ్స్ 'ఆపిల్' సంస్థను స్థాపించారు. 'ఆపిల్-1' కంప్యూటర్ కోసం పని చేస్తున్నప్పుడు స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్'నే ఇప్పుడు ఆర్ఆర్ ఆక్షన్స్ వేలానికి పెట్టింది. ఈ ఆక్షన్ ప్రక్రియ ఈ నెల ఆరో తేదీతో ముగుస్తుంది. ఇప్పటి వరకూ దాఖలైన బిడ్లు.. ఇక ముందు దాఖలయ్యే బిడ్లతో కలిపి దానికి ఎంత ధర వస్తుందో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. స్టీవ్ జాబ్స్ ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చే వారు కాదట. కానీ, ఆయన తన పూర్తి పేరుతో కూడిన సంతకం చేయడం వల్లే ఈ 'చెక్'కు క్రేజ్ పెరగడానికి కారణం. అంతే కాదు స్టీవ్ జాబ్స్ వాడిన పలు వస్తువులను అనేక సంస్థలు వేలానికి పెట్టాయి.

Post a Comment

0 Comments

Close Menu