Ad Code

జొమాటో డెలివరీ ఏజెంట్లకు ఒకే రోజు రూ.97 లక్షల టిప్ !

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ  దేశ ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇంట్లో గ్రాండ్‌గా పార్టీలు చేసుకున్నారు. ఈ సందర్భంలో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు భారీగా కస్టమర్ల నుండి ఆర్డర్లు అందాయి. అయితే న్యూ ఇయర్ రోజు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు రూ.97 లక్షలకు పైగా టిప్ అందుకున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు సంపాదించాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల సీఈఓలు గతేడాది కంటే రికార్డు స్ధాయిలో ఈ ఏడాది ఆర్డర్లు అందుకున్నట్లు లెక్కలు పంచుకున్నారు. కొత్త సంవత్సరంలో భారతీయులు డెలివరీ ఏజెంటర్లకు రూ.97 లక్షలకు పైగా టిప్ ఇచ్చారని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'లవ్ యూ ఇండియా.. ఈ రాత్రి మీకు అందిస్తున్న డెలివరీ ఏజెంట్లకు మీరు ఇప్పటి వరకు రూ.97 లక్షలకు పైగా టిప్ చేసారు' అంటూ దీపిందర్ గోయల్ పోస్టు పెట్టారు. దీపిందర్ గోయల్ పోస్టుపై నెటిజన్లు స్పందించారు. 'వారు అందుకు అర్హులు' అని 'ఇది మంచి విషయం.. సూపర్ హ్యాపీ' అంటూ ట్వీట్ చేశారు. జొమాటో యాజమాన్యంలోని క్విక్ కామర్స్ డెలివరీ ప్లాట్ ఫామ్ బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అల్బిందర్ ధిండా కూడా ఒకరోజుల అత్యధిక ఆర్డర్‌లను లాగిన్ చేసిందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu