Ad Code

శాంసంగ్ గెలాక్సీ కొత్త సిరీస్ వాచ్‌ లు !


శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ని గత ఏడాదిలో కంపెనీ గెలాక్సీ అన్ ప్యాకడ్ ఈవెంట్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ బ్రాండ్ భారత మార్కెట్లో లేటెస్ట్ వేరబుల్ డివైజ్‌ల కోసం ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రఫీ), BP (రక్తపోటు) మానిటరింగ్ సామర్థ్యాలను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 లైనప్‌లోని శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా కొత్త హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తమ ఇళ్లలోనే ఈసీజీ పరీక్షలను చేసుకోవచ్చు. సాధారణ హెల్త్ చెకింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. బీపీ, ఈసీజీ ట్రాకింగ్ ఫీచర్లు గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ గెలాక్సీ వాచ్ సిరీస్ ధర రూ. 21,999 నుంచి కొనుగోలు చేయొచ్చు. భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్, సర్టిఫికేషన్‌లు పొందిన తర్వాత శాంసంగ్ భారత్‌లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌లో రక్తపోటు మానిటరింగ్, ఈసీజీ ఫీచర్లను యాక్టివేట్ చేస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం.. వేరబుల్ డివైజ్‌ల్లో బండిల్ చేసిన శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు.. అప్‌డేట్‌లు OTA (ఓవర్-ది-ఎయిర్) రోల్‌అవుట్ ద్వారా డివైజ్‌లు చేరుకుంటాయి. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ 5 డివైజ్‌ల్లో అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులు గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ వాచ్ 4 మోడళ్లను వారి మణికట్టుపై ధరించాలి. ఈసీజీ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా వారి గుండె చప్పుడు, లయను కొలవవచ్చు. చర్మంపై ఉంచిన సెన్సార్‌లు గుండె కొట్టిన ప్రతిసారీ ఉత్పత్తి చేసే విద్యుత్ సంకేతాలను గుర్తిస్తాయి. డేటా గ్రాఫ్‌లో రికార్డ్ అవుతుంది. శాంసంగ్ హెల్త్ మానిటర్ ఈసీజీ యాప్‌తో, వినియోగదారులు ఆరోగ్య నిపుణులతో ఈసీజీ డేటాను క్రియేట్ చేయవచ్చు లేదా రికార్డ్ చేయవచ్చు. ఆపై రిపోర్టును సేవ్ చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu