బోట్ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ స్టైలిష్ లుక్ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. స్లిమ్ మెటల్ డిజైన్ సహా సిలికాన్, మెటల్, మాగ్నెటిక్ స్ట్రాప్ ఎంపికల్లో లభిస్తుంది. 2.01 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే : బోట్ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్‌వాచ్ 410*502 పిక్సల్ రిజల్యూషన్‌తో 2.01 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్‌వాచ్ వందకు పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్టుతో వస్తుంది. మరియు బిల్డి ఇన్ మైక్, డయల్ ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10 ఫోన్ నంబర్ల వరకు సేవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్ రేట్, SpO2, ఒత్తిడి, నిద్ర నాణ్యత పర్యవేక్షణ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీనిలో 100 కి పైగా వాచ్‌ఫేస్‌లను కలిగి ఉంది. ఇది ఫంక్షనల్ క్రౌన్‌తో వస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్టు్ సహా రోజువారీ పనితీరును పర్యవేక్షిస్తుంది. QR చెల్లింపులు, సెడంటరీ అలెర్ట్, కెమెరా కంట్రోల్, బిల్ట్ ఇన్ గేమ్స్, మ్యూజిక్ కంట్రోల్, వాతావరణం, అలారం, స్టాప్‌వాచ్, DND, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం, బోట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.2,999కు కొనుగోలు చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో ఐదు రోజుల వరకు వినియోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది. అలాగే బ్లూటూత్ ఫీచర్ కాలింగ్ ఫీచర్‌ను వినియోగిస్తే రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. స్టీల్ బ్లాక్, డీప్ బ్లూ, కూల్ గ్రే మరియు యాక్టివ్ బ్లా్క్ రంగుల్లో లభిస్తుంది.
0 Comments