Ad Code

ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగో పక్షుల మృతి !


ముంబై ఎయిర్‌పోర్టులో ముంబై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగో పక్షుల చనిపోయాయి. మరిన్ని పక్షుల కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషణ చేస్తున్నారు. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకొంది. దుబాయ్‌ నుంచి ముంబైకి వస్తున్న ఎమిరేట్స్‌ విమానం సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆ వైపుగా ఎగురుతున్న ఫ్లెమింగో పక్షుల గుంపు విమానాన్ని ఢీకొన్నాయి. కాసేపటికి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయింది. అయితే తీవ్రంగా గాయపడి వివిధ ప్రాంతాల్లో పడిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ రాత్రి ఆయా ప్రాంతాల్లో 30 పైగా.. మరుసటిరోజు మరికొన్ని పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పక్షులు ఈ ప్రాంతంలో కనిపించడం అరుదని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu