Ad Code

దేశంలో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్‌ వివో ?


నవరి-మార్చి త్రైమాసికంలో వివో భారతదేశంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ మొదటి నెలల్లో వివో అమ్మకాలు శామ్‌సంగ్‌ను అధిగమించాయి. శామ్‌సంగ్‌ ప్రీమియం మార్కెట్‌లో స్థానం సంపాదించుకున్నా మూడవ స్థానానికి పడిపోయిందని ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక పేర్కొంది. అయితే శామ్‌సంగ్ వాటాపరంగా మాత్రం లీడర్‌ షిప్‌ను కొనసాగించింది. వివో, షావోమితో పోల్చితే ఎక్కువ ధర కలిగిన ఫోన్‌ల సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ వాటాలో నాలుగింట ఒక వంతును కలిగి ఉంది. సగటు అమ్మకపు ధర 425 డాలర్లుగా ఉంది. ముఖ్యంగా రూ. 20 వేల కంటే ఎక్కవ సెగ్‌మెంట్‌లో శామ్‌సంగ్‌ ఆధిపత్యం కనబర్చింది. వివో 5G సాంకేతికతలో దాని నాయకత్వం కారణంగా 17.5 శాతం నుండి 19 శాతం వాల్యూమ్ ద్వారా మార్కెట్ వాటాను పొందింది. ఇక చైనాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ 18.8 వాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 3 శాతం పెరగడం విశేషం. శామ్‌సంగ్‌ 17.5 శాతంతో వెనకబడి ఉంది. గతేడాదితో పోల్చితే 20.3 శాతం తగ్గడం గమనార్హం. ఇక యాపిల్‌ కూడా భారత్‌లో ఈ త్రైమాసికంగా రికార్డు అమ్మకాలను చూసింది. ప్రీమియం విభాగంలో యాపిల్ అగ్ర స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఐఫోన్‌ 15 సేల్స్‌ భారీగా పెరిగాయి. షావోమీ 28 శాతం వృద్ధిని సాధించింది. ఇక చైనాకు చెందిన మరో దిగ్గజం ఒప్పో 10.1 శాతం వాల్యూమ్ షేర్‌తో నాల్గవ స్థానాన్ని పొందగా, రియల్‌మే 9.9 శాతం సంపాదించింది. గతేడాదితో పోల్చితే 18 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇక మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం నథింగ్‌ (2ఏ) 144శాతం వేగవంతమైన వృద్ధిని సాధించింది. గతేడాదితో పోల్చితే మోటోరోల అమ్మకాలు 58 శాతం పెరగడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu