Ad Code

పదేండ్ల నిజం, ఆరు నెలల అబద్ధం మీ ముందుంది పట్టభద్రులు ఆలోచన చేసి ఓటెయ్యండి !


తెలంగాణలోని చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన మునుగోడు నియోజక వర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహాక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని  మాట్లాడుతూ మోసగాళ్ల మాటలను నమ్మి గోసపడొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పారు. అయినా కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,  కాంగ్రెస్ కావాల్నా, కరెంట్ కావాల్నా? అనే విషయంలో రైతులు, గీత కార్మికులు ఆలోచన చేయాలన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్‌ 9 రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యాఫెస్టోలో దొడ్డు బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి, ప్రభుత్వం ఏర్పడ్డాక సన్న వడ్లకే ఇస్తానని మాట మార్చి మోసం చేశారన్నారు. ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పోదు, కానీ ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు, రేవంత్ రెడ్డి ,రాజగోపాల్ రెడ్డి ఎలా తిట్టుకున్నారో మీకు తెలుసు. మునుగోడులో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఫ్లోరైడ్ ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. వెయ్యేండ్లు గుర్తుండి పోయేలా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించింది కేసీఆఆర్ కాదా? అని ప్రశ్నించారు. పదేండ్ల నిజం, ఆరు నెలల అబద్ధం మీ ముందుంది పట్టభద్రులు అలోచన చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్ర జాలకున్ని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారి చేస్తానని నిరుద్యోగులను మోసం చేసిండని విమర్శించారు. రాకేష్ రెడ్డి పేద కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ. బిట్స్ బిలానిలో చదివిన వ్యక్తిని గెలిపించాలన్నారు. ఎన్నికల అఫిడఫిట్ లో 54 క్రిమినల్ కేసులు, ఉన్నాయని మల్లన్ననే ఎన్నికల కమిషనర్ కు ఇచ్చిండు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్ ఉంటే, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాలో మీరే తేల్చుకోండన్నారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రజలు చేసే మొదటి హెచ్చరిక కావాలన్నారు.

Post a Comment

0 Comments

Close Menu