Ad Code

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు !


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు.గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు.ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభాపక్ష నేతలు చంద్రబాబు సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు.

Post a Comment

0 Comments

Close Menu