Ad Code

కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతా !


త్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, "నేను కర్హల్, మొయిన్‌పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నికల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబట్టి ఒక సీటును వదులుకోవాలి. కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నాననే విషయం మీకు తెలియజేస్తున్నానను` అని పేర్కొన్నారు. 'లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu