Ad Code

అలల ఉద్ధృతికి నలుగురు యువకులు గల్లంతు !


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా లోని రామాపురం బీచ్‌ లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు. కొద్ది గంటల తరువాత తేజ (21), కిశోర్‌(22) మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. గల్లంతైన నితిన్‌, అమూల్‌రాజ్‌ కోసం గాలింపు చర్యలను విస్తృతం చేశారు. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి విలపించారు. గల్లంతైన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు సహాయంతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu