Ad Code

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు !


నెల12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ. 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ. 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు అతిరథుల హాజరుకావడంతో భద్రతను కూడా పటిష్టంగా చేస్తున్నారు. దాదాపు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో కేంద్రబలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu