Ad Code

కాశ్మీర్‌ ప్రజలతో యోగా చేసిన మోడీ !


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కశ్మీర్‌ ప్రజలతో యోగా చేశారు.విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపిన మోడీ, 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోడీ తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ.. యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు.ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందని మోడీ చెప్పుకొచ్చారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచదేశాధినేతలు అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరైన కొందరితో సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా కాశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిజానికి ప్రధాని ఏడు వేల మందితో కలిసి ఆసనాలు వేయాల్సి ఉండగా వర్షం కారణంగా అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు. యోగాసనాలు వేసిన అనంతరం ప్రధాని ప్రజలతో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను స్వయంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలతో పాటు 'శ్రీనగర్‌లో యోగాసనాలు వేసిన తర్వాత దిగిన సెల్ఫీలు. డాల్ సరస్సు వద్ద అసమాన్యమైన చైతన్యం కనిపించింది' అంటూ రాసుకొచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu