Ad Code

16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ?


ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. ఇప్పటికే కీలక హామీలతో పాటు శ్వేతపత్రాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం త్వరలో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16న కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ అసెంబ్లీ బడ్జెట్ భేటీ నిర్పహించాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేయాలా అన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో సంక్షేమ పథకాల అమలు కూడా ఉంది. ఇప్పటికే ఎన్డీయే ఎన్నికల హామీల్లో భాగమైన పెన్షన్ల పెంపుతో పాటు మరో నాలుగు అంశాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మిగిలిన వాటిపై ఈసారి కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో పాటు మరికొన్ని అంశాలున్నాయి. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశముంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా కుదురుకోకపోవడంతో మరో రెండు, మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్డెట్ ద్వారా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆర్డినెన్స్ విడుదలకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 

Post a Comment

0 Comments

Close Menu