Ad Code

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి !


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, సిఎస్ పురం మండలం, శివం వారి పల్లె గ్రామానికి చెందిన గంజరాపల్లి అనిల్ (45) ఆదివారం రాత్రి ఉప్పల్వాయి గ్రామం నుండి పోసానిపేట వస్తుండగా పోసానిపేట జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అతి వేగంతో అదుపుతప్పి రోడ్డు క్రిందపడి అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu