Ad Code

అమెరికాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు తెలుగు వాళ్లు అరెస్టు !


మెరికాలో టెక్సాస్ రాష్ట్రం గిన్స్ బర్గ్ లేన్‌లోని 1000వ బ్లాక్‌లో నలుగురు తెలుగు వాళ్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ దొరికారు. 15 మంది అమ్మాయిలు ఓ గదిలో నేలపై పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. భార్యా భర్తలతో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన  జరిగింది. ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొంత మంది యువతుల్ని తమ షెల్ కంపెనీల్లో జాబ్స్ ఇస్తామని మభ్య పెట్టారు. అక్కడకు వెళ్లాక నిర్బంధించి తక్కువ జీతానికి పని చేయించుకున్నారు. ఈ విషయం ఫెస్ట్ కంట్రోల్ చేసేందుకు వెళ్లిన ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ ఇంటికి ఫెస్ట్ కంట్రోల్ చేసేందుకు వెళ్లగా అక్కడ అమ్మాయిలు ఉండటం చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రిన్స్ టన్ పోలీసులు సోదాలు నిర్వహించడంతో 15 మంది యువతులను గుర్తించారు. నిందితులు సంతోష్ కట్కూరీ, ఆయన భార్య ద్వారక గుండా, చందన్ దాసి రెడ్డి, అనిల్ మాలెలను అరెస్టు చేశారు. వీరంతా ఇండియన్స్, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 13న ఈ ఘటన జరగ్గా అలస్యంగా  వెలుగు చూసింది. ఈ ముఠా గుట్టురట్టుతో మెలిస్సా, మిక్ కెన్నీ వంటి నగరంల్లో కూడా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కూడా లాప్ టాప్స్, సెల్ ఫోన్, ప్రింటర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సంతోష్, ద్వారకా నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట యువతుల్ని, అబ్బాయిలను మభ్య పెట్టారని తెలుస్తుంది. ఉద్యోగంలో చేరాక వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. గృహంలో నిర్భంధించి.. పని చేయించుకున్నారు. డల్లాస్ కేంద్రంగా ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. ఓ భారత ఏజెన్సీలో నలుగురు తమతో బలవంతంగా పని చేయిస్తున్నారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో నలుగుర్ని అదుపులోకి తీసుకుని హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, గృహ నిర్బంధం తో సహా పలు సెక్షన్ల కింద ప్రిన్స్ టన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu