Ad Code

హైదరాబాద్ లో నేషనల్ మార్ట్ ప్రారంభం !


హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జీవీకే, ఫోరంమాల్, ఇనార్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ ఐమాక్స్‌, నెక్ట్స్‌ గలేరియా, అశోక 1, డీమార్ట్‌, రత్న దీప్‌, మోర్‌, జియో మార్ట్‌, లులు మాల్స్ వంటివి ఉన్నాయి.ఇక వాటిలో నిత్యం చాలామంది షాపింగ్ చేస్తుంటారు. అసలు ఒక్కరోజు కూడా మాల్స్ అనేవి జనసాంద్రత లేకుండా ఖాళీగా ఉండటం అంటూ జరగదు. నగరంలో నిత్యావసర వస్తువులు విక్రయించే నేషనల్ మార్ట్ తాజాగా ఓపెన్ అయ్యింది. ఈ మార్ట్ ను మేడ్చల్ లో 40 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎఫ్ఎంసీజీతో పాటు నిత్యావసర వస్తువులను విక్రయిస్తుంటారు. ఈ మార్ట్ లో కిరాణాతోపాటు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయోన్సెన్, కుక్ వేర్, పాదరక్షలు, దుస్తులు వంటివి సరసమైన ధరలకు అందిస్తున్నానమని ఆ నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగర్వాల్ చెప్పారు. అలాగే స్టైల్ మార్ట్ పేరుతో సొంత బ్రాండ్ దుస్తులను అమ్ముతున్నామని పేర్కొన్నారు. అయితే ఇలా నిత్యవసర వస్తువులు దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తులు, పాదరక్షలు వరకు అన్ని ఈ నేషనల్ మార్ట్ లో సరసమైన ధరకు దొరుకుతాయి. 

Post a Comment

0 Comments

Close Menu