Ad Code

ఆంధ్రప్రదేశ్ టెట్ షెడ్యూల్లో మార్పులు !


ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అంతకు ముందే మరోసారి టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత అభ్యర్ధుల నుంచి వచ్చిన వినతుల మేరకు పరీక్షలకు 90 రోజుల సమయం ఇవ్వాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇవాళ ప్రకటన చేసింది. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇవాళ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గతంలో ప్రకటించిన విధంగా ఆగస్టు 5 నుంచి 20 వరకూ జరగాల్సిన టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకూ మార్చింది. దీంతో విద్యార్ధులకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం లభించనుంది. అలాగే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ నూ మార్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇవాళ విడుదల చేసిన టెట్ తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3 వరకూ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ లో దరఖాస్తుల్ని ఆగస్టు 3 వరకూ స్వీకరిస్తారు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్ లైన్ లో మాక్ టెస్టులు పెడతారు. జూలై 22 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్ అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకూ పరీక్షలు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 4న ప్రొవిజినల్ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 5 నుంచి అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 27న ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు. 

Post a Comment

0 Comments

Close Menu