Ad Code

రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ధరలకే సరుకుల విక్రయం !


ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుఉన్నవారికి అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకు సరకులను అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడం పై చర్చించారు. ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్, ఎండీ వీరపాండియన్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలను వెల్లడించారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ. 181కి విక్రయిస్తుండగా,రైతు బజార్లలో 160కే విక్రయిస్తారు. స్టీమ్డ్ రైస్ రూ.49, బియ్యం రూ. 48కే విక్రయిస్తారు.


Post a Comment

0 Comments

Close Menu