Ad Code

చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు కృషి !


ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. బుధవారం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటిడ్‌(బీపీసీఎల్‌) ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం 'ఎక్స్‌' వేదికగా తెలిపారు. ''దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రోకెమికల్‌ సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఐదు వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. అందుకే, 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సంస్థ ప్రతినిధుల్ని కోరా. ఇబ్బంది లేని పద్ధతిలో ఆ సంస్థకు సౌకర్యాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది''అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu