Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label ఎలక్ట్రానిక్స్ డేస్ అనే రెండు న్యూ సేల్స్. Show all posts
Showing posts with label ఎలక్ట్రానిక్స్ డేస్ అనే రెండు న్యూ సేల్స్. Show all posts

Saturday, February 26, 2022

అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్


మెగా మ్యూజిక్ ఫెస్ట్, ఎలక్ట్రానిక్స్ డేస్ అనే రెండు న్యూ సేల్స్ తీసుకొచ్చిన అమెజాన్ హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు తదితర గ్యాడ్జెట్‌లపై డీల్స్, ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎలక్ట్రానిక్స్ డేస్, మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్స్ వరుసగా ఫిబ్రవరి 27, ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయి. హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అమెజాన్ లో కనీసం రూ.8,000 కొనుగోలు చేసినట్లయితే కస్టమర్లు రూ.2,000 వరకు 7.5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్స్ లో భాగంగా అమెజాన్ కొన్ని గ్యాడ్జెట్‌లపై 65% డిస్కౌంట్ ప్రకటించింది. మంచి క్వాలిటీతో వచ్చే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన బోట్ ఎయిర్‌డోప్స్ 441 కేవలం రూ.1,999కే అమెజాన్ లో లభిస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ IWP టెక్నాలజీతో వస్తాయి. దీనర్థం ఛార్జింగ్ కేస్‌ను ఓపెన్ చేయగానే ఇయర్‌బడ్స్ పవర్ ఆన్ అయి కనెక్షన్ మోడ్‌లోకి ఆటోమేటిక్ గా వెళ్తాయి. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీతో సూపర్ ఫాస్ట్ అండ్ స్మూత్ కనెక్టివిటీని అందిస్తాయి. ప్రతి ఇయర్‌బడ్‌ 35ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మీరు ఒకేసారి 5 గంటల పాటు వీటిని ఉపయోగించవచ్చు. క్యారీ కమ్ ఛార్జ్ కేస్‌తో అదనంగా 25H ప్లేబ్యాక్‌ను పొందవచ్చు. బ్లూటూత్ V5.0తో వచ్చే బోట్ రాకర్జ్ 550 ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ కేవలం రూ.1,899కే లభిస్తోంది. ఇది 500ఎంఏహెచ్ బ్యాటరీతో 20 గంటల వరకు అత్యుత్తమ ప్లేబ్యాక్ టైం అందిస్తుంది. బోట్ రాకర్జ్ 550 హెడ్‌ఫోన్‌ను బ్లూటూత్, AUX కేబుల్ అనే రెండు మోడ్‌ల ద్వారా కనెక్ట్ చేయవచ్చు. 800ఎంఏహెచ్ బ్యాటరీతో 4 గంటల వరకు ప్లేబ్యాక్ టైం సామర్థ్యంతో వచ్చే బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ 5W స్పీకర్‌ను మీరు రూ.1,299కే సొంతం చేసుకోవచ్చు. ట్రూ వైర్‌లెస్ ఫీచర్‌ని కలిగి ఉండే ఈ స్పీకర్‌లోని రెండు స్టోన్ స్పీకర్‌లను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. నాయిస్ బడ్స్ వీఎస్303 ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 6 గంటల ప్లేటైమ్‌ను, ఛార్జింగ్ కేస్‌తో అదనంగా 18 గంటల పాటు ప్లేటైమ్‌ను.. మొత్తంగా 24 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. దీని హైపర్ సింక్ టెక్నాలజీతో ఈజీగా, ఫాస్ట్ గా కనెక్షన్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేస్‌ను ఓపెన్ చేయగానే ఈ బర్డ్స్ డివైజ్ కు కనెక్ట్ అయిపోతాయి. ఈ బడ్స్‌ను రూ.1,499కి పొందవచ్చు. దీని 13mm స్పీకర్ డ్రైవర్ ద్వారా మీరు అదిరిపోయే సౌండ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సోనీ జెడ్‌వీ-1 డిజిటల్ వ్లాగ్ కెమెరాతో మీ వ్లాగ్ వీడియోలను అద్భుతంగా రూపొందించొచ్చు. సోనీ మెరుగైన కలర్ సైన్స్ వల్ల నేచురల్ ఇమేజెస్ మోర్ లైవ్లీగా వివిడ్ గా వస్తాయి. స్టెడీ-షాట్ జాయింట్ ఆప్టికల్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ సిస్టమ్‌ వల్ల నడుస్తున్నప్పుడు కూడా పిక్చర్ ఏమాత్రం అదరకుండా స్థిరంగా రికార్డు అవుతుంది. హ్యాండ్‌హెల్డ్ షాట్‌లు, షూటింగ్ గ్రిప్‌తో వ్లాగింగ్ కోసం తీసుకొచ్చిన ఈ కెమెరా బ్లర్, షేక్-ఫ్రీ షాట్‌ల అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,490. జర్మన్ బ్రాండ్ Blaupunkt నుంచి Blaupunkt SBA40 సౌండ్‌బార్ ఇండియాలో విడుదలైంది. ఈ అద్భుతమైన సౌండ్‌బార్ ని కేవలం రూ.3,999కే అమెజాన్ తీసుకొచ్చింది. ఈ డ్యూయల్ పాసివ్ రేడియేటర్‌లు క్రిస్టల్ క్లియర్ సరౌండ్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. Blaupunkt SBA40 బ్లూటూత్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ అయిన బోట్ రాకర్జ్ 330 తన 10mm డైనమిక్ డ్రైవర్ల ద్వారా చక్కటి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ ఒకేసారి 30 గంటల వరకు భారీ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్ 10 గంటల వరకు ప్లే టైమ్‌ని అందిస్తుంది. ఇది ASAP ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది రూ.1,399కి దొరుకుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇన్-బిల్ట్ ఈక్వలైజర్‌తో బేస్, ట్రెబుల్ టోన్‌లను అద్భుతంగా డెలివరీ చేసే ఎల్‌జీ ఎఫ్‌పీ ఇయర్‌బడ్స్ రూ.9,990కి అందుబాటులోకి వచ్చాయి. జీరో లేటెన్సీ మానిటరింగ్‌తో వచ్చే పోర్టబుల్ పాడ్‌క్యాస్ట్ అయిన Maono AU-AM200 రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు. మిల్లీ సెకన్లలో కూడా ఆలస్యం లేదా రిటర్నింగ్ సిగ్నల్‌లో లాగ్ లేకుండా మెరుగైన పనితీరు, రికార్డింగ్ సేవలను ఇది అందిస్తుంది. మీ వాయిస్ ని క్రిస్టల్ క్లియర్ గా రికార్డు చేసేందుకు 48Hkz/16Bit శాంప్లింగ్ రేటును ఇది ఆఫర్ చేస్తుంది. ఇది గిటార్ ప్లే చేయడానికి ప్రత్యేకంగా సరిపోతుంది. స్టూడెంట్స్, అనుభవజ్ఞులైన ప్లేయర్‌లకు బాగా ఉపయోగపడే యమహా FS100C అకౌస్టిక్ గిటార్ రూ.9,290కే మీరు కొనుగోలు చేయొచ్చు.

Popular Posts