Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label ఐడియా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచగా. Show all posts
Showing posts with label ఐడియా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచగా. Show all posts

Friday, March 24, 2023

భారీగా పెరిగిన జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధర !


మార్కెట్ ట్రెండ్ కు అనుకూలంగా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ , ఐడియా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచగా ప్రస్తుతం జియో కూడా పోస్ట్ పెయిడ్ ధరలను భారీగా పెంచింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు జియో షాకిచ్చింది. జియో  రూ. 199ప్లాన్ ధరపై ఏకంగా రూ. 100పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299గా మారింది. జియో రూ. 199 ప్రకారం వినియోగదారులు ఈ ప్లాన్‌లో 25GB డేటాను పొందేవారు. అయితే ఇప్పుడు దీని ధర రూ.299కి పెరగడంతో అదనంగా మరో 5 జీబీ డేటా లభిస్తుంది. 30 జీబీ డేటా ముగిసిన తర్వాత కస్టమర్లు ఒక్కో జీబీకి రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు ఉచితంగా 100 SMSలను పొందుతారు. దీంతో అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా కస్టమర్లు JioTV, Jio సినిమా, Jio సెక్యూరిటీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.

Popular Posts