Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label జియో వెల్‌కమ్ ఆఫర్ ?. Show all posts
Showing posts with label జియో వెల్‌కమ్ ఆఫర్ ?. Show all posts

Tuesday, March 21, 2023

జియో వెల్‌కమ్ ఆఫర్ ?


రిలయన్స్ జియో మార్చి 21న తన ట్రూ 5G సర్వీసులను కొత్తగా మరో 41 నగరాల్లోకి విస్తరించింది. దాంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5G నెట్‌వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. కొత్తగా జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా తక్కువ వ్యవధిలో విస్తృత స్థాయిలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో అవతరించింది. జియో 5G సర్వీసులు ప్రారంభమైన ప్రాంతాల్లో ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం (ఆంధ్రప్రదేశ్), మార్గోవ్ (గోవా), ఫతేహాబాద్, 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. మరికొన్ని కొత్త నగరాల్లో గోహనా, హన్సి, నార్నాల్, పల్వాల్ (హర్యానా), పౌంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్), రాజౌరి (జమ్ము & కాశ్మీర్) దుమ్కా (జార్ఖండ్), రాబర్ట్‌సన్‌పేట్ (కర్ణాటక). అలాగే, ఇతర నగరాల్లో కన్హంగాడ్, నెడుమంగడ్,తాలిపరంబ, తలస్సేరి, తిరువల్ల (కేరళ), బేతుల్, దేవాస్, విదిషా (మధ్యప్రదేశ్) భండారా, వార్ధా (మహారాష్ట్ర), లుంగ్లే (మిజోరం), బైసనగర్, రాయగడ (ఒడిశా), హోషియార్‌పూర్ (పంజాబ్), టోంక్ (రాజస్థాన్), కారైకుడి, కృష్ణగిరి, రాణిపేట్, తేని అల్లీనగరం, ఉదగమండలం, వాణియంబాడి (తమిళనాడు), కుమార్‌ఘాట్ (త్రిపుర) ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తమ జియో ట్రూ 5Gని వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. జియో పరిధిని వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. జియో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను Jio వెల్‌కమ్ ఆఫర్‌ ను కూడా ఉచితంగా పొందవచ్చునని జియో ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ప్రణాళికాబద్ధమైన True-5G నెట్‌వర్క్‌ను ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించింది.

Popular Posts