Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label నదులు. Show all posts
Showing posts with label నదులు. Show all posts

Monday, April 4, 2022

నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి ఎందుకు ?


వేసవి, చలికాలాల్లో నదులు, కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా గమనించారా? అంటే వేసవి కాలంలో నదులు, చెరువుల్లోని నీరు చల్లగా మారుతుంది. అదే శీతాకాలంలో ఐతే గోరువెచ్చగా మారుతుంది. నీటి ఉష్ణోగ్రత – పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినా చెరువులు, నదుల్లోని నీరు చల్లగా ఉంటుంది. ఈ తేడాలెందుకు ఏర్పడతాయంటేవేసవిలో నీరు ఎందుకు చల్లగా ఉంటుందంటే నిజానికి వేసవిలో నీరు వేడిగా మారకుండా గరిష్ట ఉష్ణోగ్రతను భరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నీరు వేడి చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. అందువల్లనే నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలంలో నీరు ఎందుకు గోరువెచ్చగా ఉంటుందంటే.. నీటి ఉష్ణోగ్రత దాని అణువుల వేగంపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఎంత వేగంగా కదిలితే, నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉంటుంది. అదే నీటి అణువుల వేగం తక్కువగా ఉంటే చల్లగా ఉంటుంది. అందువల్లనే బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చెయ్యదు. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు భూమి కింద ఉండే నీరు ప్రభావితం అవ్వదు. వేసవిలో భూమి కింద ఉండే నీరు చల్లగానూ, చలికాలంలో గోరువెచ్చగానూ ఉండడానికి కారణం ఇదే.

Popular Posts