రిలయన్స్ జియో మార్చి 21న తన ట్రూ 5G సర్వీసులను కొత్తగా మరో 41 నగరాల్లోకి విస్తరించింది. దాంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5G నెట్‌వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. కొత్తగా జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా తక్కువ వ్యవధిలో విస్తృత స్థాయిలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో అవతరించింది. జియో 5G సర్వీసులు ప్రారంభమైన ప్రాంతాల్లో ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం (ఆంధ్రప్రదేశ్), మార్గోవ్ (గోవా), ఫతేహాబాద్, 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. మరికొన్ని కొత్త నగరాల్లో గోహనా, హన్సి, నార్నాల్, పల్వాల్ (హర్యానా), పౌంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్), రాజౌరి (జమ్ము & కాశ్మీర్) దుమ్కా (జార్ఖండ్), రాబర్ట్‌సన్‌పేట్ (కర్ణాటక). అలాగే, ఇతర నగరాల్లో కన్హంగాడ్, నెడుమంగడ్,తాలిపరంబ, తలస్సేరి, తిరువల్ల (కేరళ), బేతుల్, దేవాస్, విదిషా (మధ్యప్రదేశ్) భండారా, వార్ధా (మహారాష్ట్ర), లుంగ్లే (మిజోరం), బైసనగర్, రాయగడ (ఒడిశా), హోషియార్‌పూర్ (పంజాబ్), టోంక్ (రాజస్థాన్), కారైకుడి, కృష్ణగిరి, రాణిపేట్, తేని అల్లీనగరం, ఉదగమండలం, వాణియంబాడి (తమిళనాడు), కుమార్‌ఘాట్ (త్రిపుర) ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తమ జియో ట్రూ 5Gని వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. జియో పరిధిని వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. జియో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను Jio వెల్‌కమ్ ఆఫర్ ను కూడా ఉచితంగా పొందవచ్చునని జియో ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ప్రణాళికాబద్ధమైన True-5G నెట్‌వర్క్‌ను ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించింది.
Search This Blog
Showing posts with label రిలయన్స్ జియో. Show all posts
Showing posts with label రిలయన్స్ జియో. Show all posts
Tuesday, March 21, 2023
Monday, April 18, 2022
రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ నుంచి రూ. 300 లోపు బెస్ట్ ప్లాన్లు
రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తదితర టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం బడ్జెట్ ధరతో కూడిన ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది, ఇది ప్రతిరోజూ 1 GB డేటాతో వస్తుంది. ఎయిర్‌టెల్ రూ. 209, రూ. 239 మరియు రూ. 265 ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 1 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఒక నెల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ రూ.209 ప్లాన్‌లో 21 రోజుల వాలిడిటీ, రూ.239కి 24 రోజుల వాలిడిటీ, రూ.265 ప్లాన్‌లో 28 రోజులు. క్యాలెండర్ ప్లాన్‌ను ప్రారంభించింది ఎయిర్టెల్. దీని ధర రూ. 296. మరియు ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 30 రోజులు. ఈ అపరిమిత వాయిస్, 100SMS మరియు మొత్తం 25GB డేటా ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. డేటా అయిపోయిన తర్వాత, వినియోగదారులు ప్రతి MBకి 50 పైసలు చెల్లించాలి. రిలయన్స్ జియో కూడా 30 రోజుల చెల్లుబాటుతో వచ్చే ప్లాన్‌ను కలిగి ఉంది. జియో యొక్క రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌లో, ప్రతిరోజూ 1.5 GB డేటా ఇవ్వబడుతుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత, దాని వేగం 64Kbps అవుతుంది. రిలయన్స్ జియో రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో వస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులకు ప్రతిరోజూ 100SMS మరియు Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ 1 నెల వాలిడిటీతో వస్తుంది. Jio Rs. 239 Plan ను ఎంచుకున్న వినియోగదారులకు ప్రతిరోజూ 1.5 GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఇంకా ప్రతిరోజూ 100SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో, జియో మూవీస్, జియో క్లౌడ్ వంటి యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.
Monday, March 7, 2022
వెనుకబడిపోతున్న బీఎస్‌ఎన్‌ఎల్?
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇండియన్ టెలికాం మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. రెండు సంవత్సరాల ఆలస్యం తర్వాత, ఎట్టకేలకు మెట్రో, పెద్ద నగరాల్లో 4G సేవను వచ్చే నాలుగు నుండి ఆరు నెలల్లో ప్రారంభించబోతోంది. కంపెనీ TCS తో తన 4G పరీక్షను ఫిబ్రవరి 28న పూర్తి చేసింది. 2019 నుండి 4G సేవను అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ 4జీ సేవలు ప్రారంభించలేదు బీఎస్‌ఎన్‌ఎల్. అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పుడు 5Gని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ తన 4G సేవను ప్రారంభించినప్పుడు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.ఎందుకంటే ఈ ఏడాది మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. వేలం తర్వాత టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించడానికి కేవలం 4 నుండి 6 నెలల సమయం పడుతుంది. ఒక వైపు అన్ని టెలికాం కంపెనీలు 5జీ సేవలు ప్రారంభిస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం 4జీ సేవల్లోనే ఉంది.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...